vajpayee: నిజాయతీ ముందు అవినీతి మోకరిల్లుతోంది.. వాజ్ పేయి సమాధిని రాహుల్ గాంధీ సందర్శించడంపై బీజేపీ విమర్శ

Political slugfest over Rahul Gandhi visit to Sadaiv Atal

  • బ్రిటిష్ పాలకులకు వాజ్ పేయి ఇన్ఫార్మర్ అంటూ కాంగ్రెస్ నేత గౌరవ్ ఆరోపణ
  • మండిపడ్డ బీజేపీ నేతలు.. గౌరవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • అటల్ జయంతి సందర్భంగా వాజ్ పేయి సమాధి ముందు రాహుల్ నివాళి

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ‘సదైవ్ అటల్’ సందర్శన విమర్శలకు దారితీసింది. అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా వాజ్ పేయి సమాధిని సందర్శించి రాహుల్ నివాళులు అర్పించారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాయతీ ముందు అవినీతి మోకరిల్లుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతకుముందు వాజ్ పేయిపై కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ పంది చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు.

కాంగ్రెస్ నేత గౌరవ్ పాండి ఇటీవల వాజ్ పేయిని బ్రిటిష్ పాలకుల ఇన్ఫార్మర్ అని ఆరోపించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వాజ్ పేయి బ్రిటిషర్లకు ఇన్ఫార్మర్ గా చేశారని విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వాజ్ పేయి బాయ్ కాట్ చేయడమే కాకుండా అందులో పాల్గొన్న వారి వివరాలను బ్రిటిష్ పాలకులకు అందించారని గౌరవ్ ఆరోపించారు.

గౌరవ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీతో పాటు గౌరవ్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఢిల్లీలోని వాజ్ పేయి సమాధిని సందర్శించడంతో నిజాయతీ ముందు అవినీతి మోకరిల్లుతోందని బీజేపీ నేతలు అంటున్నారు.

vajpayee
sadaiv atal
Rahul Gandhi
atal birth anniversary
Congress
bjp
  • Loading...

More Telugu News