kerala accident: కేరళలో బోల్తా పడ్డ వ్యాన్.. 8 మంది అయ్యప్ప భక్తుల మృతి

At least 8 Sabarimala pilgrims killed in road accident near Kerala Tamil Nadu border
  • అయ్యప్ప దర్శనం చేసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం
  • కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఘటన
  • వేగంగా దూసుకెళుతూ అదుపుతప్పిన వ్యాన్
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల గోతిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కేరళ-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగింది.

మృతులంతా తమిళనాడుకు చెందిన థేని, అండిపెట్టికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమికంగా పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి. మురళీధరన్ సంతాపం తెలిపారు. వ్యాన్ బోల్తాపడి ఎనిమిది మంది చనిపోయిన ఘటన తనను కలచివేసిందంటూ మంత్రి ట్వీట్ చేశారు.
kerala accident
ayyappa devotees death
van overturned
sabarimala accident

More Telugu News