CPI Ramakrishna: రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna demands white paper on state govt debts
  • ఏపీ అప్పుల వివరాలు లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
  • ప్రస్తుత అప్పు రూ.3.98 లక్షల కోట్లు అని వెల్లడి
  • కార్పొరేషన్ రుణాలు కూడా కలిపితే రూ.8 లక్షల కోట్లు ఉంటుందన్న రామకృష్ణ
ఏపీ అప్పుల వివరాలను కేంద్రం నిన్న పార్లమెంటులో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఏపీ అప్పులు రూ.4 లక్షల కోట్లు అని లోక్ సభలో కేంద్రం పేర్కొందని వెల్లడించారు. ఏపీ కార్పొరేషన్ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైగానే ఉంటాయని రామకృష్ణ అంచనా వేశారు. కార్పొరేషన్ల రుణ వివరాలను కాగ్ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. 

బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.98 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థికశాఖ నిన్న లోక్ సభలో బదులిచ్చింది.
CPI Ramakrishna
Debts
AP Govt
White Paper
YSRCP
Andhra Pradesh

More Telugu News