Andhra Pradesh: ఏపీ అప్పుల వివరాలు వెల్లడించిన కేంద్రం

Union finance ministry reveals AP debts

  • పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం
  • 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు
  • ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.98 లక్షల కోట్లు
  • రాష్ట్ర జీడీపీలోనూ అప్పుల పెరుగుదల

ఏపీ అప్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభలో వెల్లడించింది. పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను పంచుకుంది. ఏపీ అప్పుల భారం ఏటా పెరుగుతోందని తెలిపింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, కానీ 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగిందని తెలిపింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతం ఉంటే... 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని వివరించింది. 

2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, అదే 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ తన సమాధానంలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా తెలియజేశారు.

Andhra Pradesh
Debts
Lok Sabha
Union Govt
  • Loading...

More Telugu News