Lionel Messi: ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత మెస్సీ భావోద్వేగ సందేశం

Lionel Messi Instagram Post And Pictures For Posterity

  • కప్ కోసం ఎన్నో ఏళ్లుగా కలగన్నానని వెల్లడి
  • తన ప్రయాణంలో మద్దతిచ్చిన అభిమానులకు
     కృతజ్ఞతలు తెలిపిన మెస్సీ
  • తుదిపోరులో ఫ్రాన్స్ పై గెలిచిన అర్జెంటీనా

సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ప్రపంచ కప్ కల సాకారం చేసుకున్నాడు. ఆదివారం లుసైల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్ లపై ఫ్రాన్స్‌ను ఓడించడంతో లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నాడు. అర్జెంటీనా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అభిమానులకు మెస్సీ భావోద్వేగ లేఖ రాశాడు. ట్రోఫీ గెలవడం తన కల అన్నాడు. తన ప్రయాణంలో మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 

‘ప్రపంచ చాంపియన్స్! ఈ మాట అనిపించుకోవాలని నేను చాలా సార్లు కల కన్నాను. ఇప్పుడు ప్రపంచ చాంపియన్స్ అయ్యామంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కుటుంబ సభ్యులకు, నన్ను ఆదరిస్తున్న వారందరికీ, మమ్మల్ని నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. అర్జెంటీనియన్లు ఐకమత్యంతో ఉన్నప్పుడు, అంతా కలిసి పోరాడినప్పుడు మనం అనుకున్నది సాధించగలమని మేం మరోసారి నిరూపించాము. ఈ విజయం వ్యక్తిత్వాలకు అతీతమైన మా జట్టు మొత్తానికి చెందుతుంది. ఇది మా అందరి, అర్జెంటీనా ప్రజలందరి కల. దాని కోసం పోరాడాం. అనుకున్నది సాధించాం’ అని మెస్సీ పేర్కొన్నాడు. ఫైనల్ ముగిసిన తర్వాత సహచర ఆటగాళ్లతో సంబరాలు చేసుకుంటూ, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ, ట్రోఫీ అందుకున్న ఫొటోలను షేర్ చేశాడు.

Lionel Messi
Instagram
  • Loading...

More Telugu News