Khushbu: ఖుష్బూ కుటుంబంలో విషాదం... అనారోగ్యంతో సోదరుడు కన్నుమూత

Khushbu brother Abu Bakar dies of illness

  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబూ బాకర్
  • పరిస్థితి విషమం.. వెంటిలేటర్ అమర్చిన వైద్యులు
  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సోదరుడు  

సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు అబూ బాకర్ ఇవాళ కన్నుమూశారు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే అబూ బాకర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

మనం ఎంతో ప్రేమించే వ్యక్తులు మనతోనే ఉండాలని కోరుకుంటామని, కానీ అది జరగదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సోదరుడి ప్రస్థానం ఇవాళ్టితో ముగిసిందని పేర్కొన్నారు. తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. తన సోదరుడు చావుబతుకుల మధ్య ఉన్నాడని, అతడికి మీ ప్రార్థనలు అవసరం అంటూ అభిమానులను కోరారు.

Khushbu
Abu Bakar
Demise
Brother
Actress
BJP
Tamil Nadu
  • Loading...

More Telugu News