Raghunandan Rao: బండి సంజయ్ అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు: రఘునందన్ రావు

Raghunandan Rao comes into support for Bandi Sanjay
  • రోహిత్ రెడ్డిపై బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినట్టుగా కథనాలు
  • డ్రగ్స్ కేసు రీఓపెన్ చేయాలని సంజయ్ అన్నారని రఘునందన్ వెల్లడి
  • ఎక్కడా బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పలేదని స్పష్టీకరణ
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బండి సంజయ్ అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాలనే బండి సంజయ్ అన్నారని వెల్లడించారు. ఎక్కడా బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పలేదని స్పష్టం చేశారు. 

15 రోజుల పాటు ప్రగతిభవన్ లో నేర్చుకున్న చిలకపలుకులనే రోహిత్ రెడ్డి పలుకుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. రోహిత్ రెడ్డితో సింహయాజి, నందు ఎన్నిరోజులు ఉన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

రోహిత్ రెడ్డి దళితులకు కేటాయించిన భూమిలో ఫాంహౌస్ కట్టుకున్నారు... లెక్కలు బయటపెట్టమంటారా? అని వ్యాఖ్యానించారు. ఆయనకు మరో గెస్ట్ హౌస్ ఉందని, అందులోకి సినిమా వాళ్లు కూడా వస్తుంటారని తెలిపారు. సర్పాన్ పల్లి ఫాంహౌస్ లో ఏం జరుగుతుంటుంది? అని ఆయన ప్రశ్నించారు.
Raghunandan Rao
Bandi Sanjay
Rohith Reddy
Drugs Case
BJP
BRS
Telangana

More Telugu News