Bollywood: పెళ్లయిన హీరోయిన్ కోసం గూగుల్ లో తెగ వెతికేశారు!

Googles Most Searched Asian 2022 is Katrina kaif

  • 2022లో గూగుల్  లో అత్యధికంగా వెతికిన ఆసియన్ల జాబితాలో కత్రినా కైఫ్ కు నాలుగో స్థానం
  • బాలీవుడ్ నుంచి మొదటి స్థానం సాధించిన వైనం
  • గతేడాది విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న కత్రినా

పెళ్లయిన తర్వాత కూడా బాలీవుడ్‌ హీరోయిన్ కత్రినా కైఫ్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ లో ఎక్కువగా వెతికిన ఆసియన్ల జాబితాలో ఆమె నాలుగో స్థానం సాధించింది. బాలీవుడ్ నుంచి తనే అగ్రస్థానంలో నిలిచింది. ‘ఆర్ ఆర్ ఆర్‘, ‘బ్రహ్మాస్త్ర’తో మంచి విజయాలు అందుకున్న అలియా భట్ ను దాటి కత్రినాకైఫ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అలియా భట్‌ ఐదో స్థానంలో ఉంది. అందం, అభినయంతో మెప్పిస్తున్న కత్రినాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 

'సూర్యవంశీ' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కత్రినా 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'ధూమ్ 3', 'జబ్ తక్ హై జాన్', 'జిందగీ నా మిలేగీ దొబారా' వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాల్లో మెప్పించింది.  గత ఏడాది డిసెంబర్‌లో యువ హీరో విక్కీ కౌశల్‌ ను పెళ్లి చేసుకున్న కత్రినా ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది. వివాహబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఆమె ‘టైగర్‌-3’, ‘మెర్రీ క్రిస్మస్‌’ చిత్రాల్లో నటిస్తోంది. 

Bollywood
Katrina Kaif
google
most
searched
asian
top
Alia Bhatt
  • Loading...

More Telugu News