Truecaller: ట్రూకాలర్ నుంచి ఫ్యామిలీ ప్లాన్

Truecaller launches new Family subscription for Rs 132 in India
  • ఐదుగురు షేర్ చేసుకోవచ్చు
  • నెలవారీ చార్జీ రూ.132
  • ఏడాది కోసం అయితే రూ.925
  • ప్రీమియం యూజర్లకు ఎన్నో ఫీచర్లు
ట్రూకాలర్ ఇప్పుడు ఒక కుటుంబానికి సరిపడా ప్లాన్ తీసుకొచ్చింది. ఒకే ప్లాన్ ను ఐదుగురు షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక యూజర్ కోసమే అయితే నెలవారీ రూ.39 ప్రీమియం ప్లాన్ అందుబాటులో ఉంది. ఇదే ప్లాన్ ఏడాది కోసం తీసుకోవాలంటే రూ.399 చెల్లించాలి. ప్రీమియం కనెక్ట్ ప్లాన్ కు నెలవారీ చార్జీ రూ.75, ఏడాది కోసం రూ.529 కూడా అందుబాటులో వున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఫ్యామిలీ ప్లాన్ అయితే ఒక నెలకు రూ.132 చెల్లించాలి. ఏడాదికి రూ.925. 

ఉచిత యూజర్లతో పోలిస్తే ప్రీమియం ప్లాన్ యూజర్లు కొన్ని ప్రత్యేక సదుపాయాలు పొందుతారు. అడ్వాన్స్ డ్ స్పామ్ బ్లాకింగ్ ఒకటి. దీనిద్వారా ఎలాంటి అనుమానిత, అపరిచిత కాల్స్, సందేశాలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. మీ నంబర్ ను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. ఇలాంటివే మరెన్నో ఫీచర్లున్నాయి.
Truecaller
launches
Family subscription
features

More Telugu News