Raviteja: 'ధమాకా' ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం!

Dhamaka movie update
  • రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా' 
  • ఈ ఏడాది ఆయన నుంచి వస్తున్న మూడో సినిమా 
  • ఈ నెల 23వ తేదీన భారీస్థాయి విడుదల 
  • రవితేజ జోడీగా సందడి చేయనున్న శ్రీలీల

రవితేజ కథానాయకుడిగా 'ధమాకా' సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించాడు. మాస్ కంటెంట్ పై మంచి పట్టున్న దర్శకుడు ఆయన. అందువలన ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి.  
 
ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కారణంగా, ఇది పూర్తిగా రవితేజ మార్క్ సినిమా అనే విషయం తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం 6: 45 నిమిషాలకు ట్రైలర్ ను వదలనున్నారు. 

రవితేజ జోడీగా శ్రీలీల అలరించనున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. సచిన్ ఖేడ్కర్ .. జయరామ్ .. తులసి కనిపించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ ఏడాది రవితేజ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా అయినా ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News