Nagababu: మా శత్రువు ఎంత బలవంతుడోననే భయం మాకు లేదు: నాగబాబు

Nagababu mentions Kanshiram quotation

  • కాన్షీరామ్ వ్యాఖ్యలు ప్రస్తావించిన నాగబాబు
  • 2024లో జనసేన పుంజుకుంటుందని వెల్లడి
  • పవన్ చరిత్ర సృష్టిస్తాడని ధీమా

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు, దివంగత కాన్షీరామ్ చేసిన వ్యాఖ్యలను నాగబాబు ట్విట్టర్ లో ప్రస్తావించారు. "మా శత్రువు ఎంత బలవంతుడోననే భయం మాకు లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మేము ఎవరికోసమైతే పోరాడుతున్నామో వారే మా శత్రువుకు రక్షణ కవచంలా మారారు. లేకుంటే ఈ యుద్ధంలో ఎప్పుడో గెలిచి విజయఢంకా మోగించి ఉండేవాళ్లం" అని పేర్కొన్నారు. 

చరిత్ర కూడా ఇదే చెబుతోందని, 2019 ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని నాగబాబు వెల్లడించారు. కానీ 2024లో అలా ఉండదని స్పష్టం చేశారు. ఎందుకంటే, విప్లవం వస్తోందని, జనసేన గెలవడం ఖాయమని తెలిపారు. అతని (పవన్ కల్యాణ్) ప్రస్థానం ఒక చరిత్ర అవుతుందని ఉద్ఘాటించారు.

Nagababu
Kanshiram
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News