Ram Charan: హుస్సేన్ సాగర్ తీరంలో కార్ రేసింగ్ కు విచ్చేసిన రామ్ చరణ్, ఉపాసన

Ram Charan and Upasana attends Indian Racing League at Hussain Sagar

  • హైదరాబాదులో ఇండియన్ రేసింగ్ లీగ్
  • నేటితో ముగిసిన పోటీలు
  • విజేతగా నిలిచిన కొచ్చి టీమ్
  • హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కు సెకండ్ ప్లేస్

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ జయప్రదంగా ముగిసింది. నిన్న ప్రాక్టీసు సెషన్లు జరగ్గా, ఆదివారం నాడు మెయిన్ రేసులు నిర్వహించారు. ఓవరాల్ చాంపియన్ గా కొచ్చి టీమ్ విజేతగా నిలిచింది. కొచ్చి మొత్తం 417.5 పాయింట్లు సొంతం చేసుకుని చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ 385 పాయింట్లతో సెకండ్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఆఖరి ఫీచర్ రేసులో మాత్రం చెన్నై జట్టు నెగ్గింది. 

కాగా, ఈ కార్ రేసింగ్ పోటీలను తిలకించేందుకు టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ సతీసమేతంగా విచ్చేశారు. రామ్ చరణ్, ఉపాసన రేసింగ్ పోటీలను ఉత్సాహంగా తిలకించారు. ఓ రేస్ కారు పక్కన నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. 

యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను ఆస్వాదించారు. హుస్సేన్ సాగర్ తీరంలో 2.7 కిమీ మేర ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ట్రాక్ పొడవునా వివిధ ప్రాంతాల్లో వీక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Ram Charan
Upasana
Indian Racing League
Hyderabad
  • Loading...

More Telugu News