Ajith: అక్కడ 'తునివు' .. ఇక్కడ 'తెగింపు'?

Thunivu Movie Update
  • అజిత్ తాజా చిత్రంగా రూపొందిన 'తునివు'
  • తెలుగు టైటిల్ గా 'తెగింపు' ఉండే ఛాన్స్ 
  • సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమా 
  • అదే పండగకి వస్తున్న విజయ్  
ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలను అక్కడి టైటిల్ తోనే తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. సూర్య హీరోగా తమిళంలో రూపొందిన 'ఈటి' .. అజిత్ హీరోగా నిర్మితమైన 'వలిమై' సినిమాలు అదే టైటిల్స్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక్కడ టైటిల్ ను మార్చే ప్రయత్నాలుగానీ .. తమిళ టైటిల్ కి తెలుగులో అర్థం చెప్పే ప్రయత్నాలుగాని కనిపించలేదు. 

తమిళ టైటిల్ తోనే తెలుగులో సినిమాలు విడుదలవుతుండటం ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసింది. ఈ సినిమాలు ఫ్లాప్ కావడానికి గల కారణాల్లో ఇక్కడ టైటిల్ మార్చకపోవడం కూడా ఒక కారణమని మేకర్స్ గ్రహించారు. ఈ నేపథ్యంలో అజిత్ నుంచి రానున్న 'తునివు' సినిమాకి ఇక్కడ తెలుగులో టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

'తునివు' సినిమాకి 'తెగింపు' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మంజు వారియర్ కనిపించనుంది. ఇటు తెలుగు .. అటు తమిళంలో ఈ సారి సంక్రాంతికి విజయ్ - అజిత్ పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది.
Ajith
Manju Warrier
Thunivu Movie

More Telugu News