sri kalahasti: శ్రీకాళహస్తిలో బ్రెజిల్ భక్తుల పూజలు

Brazil Devotees pre in sri kalahasteeswara temple

  • ప్రత్యేక రాహుకేతు పూజలు చేసిన 22 మంది బ్రెజిల్ వాసులు
  • కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడం తమ అదృష్టమని వెల్లడి
  • మంచి ఆతిథ్యం లభించిందన్న బ్రెజిల్ భక్తుడు

శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం అరుదైన దృశ్యం కనిపించింది. హిందూ సంప్రదాయ వస్త్రధారణలో పలువురు విదేశీయులు రాహు కేతు పూజలు చేశారు. బ్రెజిల్ నుంచి వచ్చిన 22 మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కాళహస్తీశ్వరుడిని భక్తితో దర్శించుకున్నారు. ఆలయ సందర్శన తమకు దక్కిన అదృష్టమని చెప్పారు.

సోమవారం ఆలయంలో నిర్వహించిన రాహుకేతు ప్రత్యేక పూజల్లో బ్రెజిల్ భక్తులు పాల్గొన్నారు. మిగతావారితో పాటు భక్తిశ్రద్ధలతో రాహుకేతు పూజలు చేశారు. మృత్యుంజయ అభిషేకంతో పలు పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కాళహస్తీశ్వరుని ఆలయాన్ని సందర్శించుకోవడం తమ అదృష్టమని, కాళహస్తిలో తనకు మంచి ఆతిథ్యం లభించిందని బ్రెజిల్‌ భక్తుడు ఒకరు తెలిపారు. 

బ్రెజిల్ భక్తులను స్వాగతించడం సంతోషంగా ఉందని కాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహణ అధికారి చెప్పారు. మన ఆచారాలు, నమ్మకాలను మనం వదిలేస్తున్నాం కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు హిందూ పురాణాలను విశ్వసిస్తున్నారని కాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.

sri kalahasti
brazil
rahu ketu pujalu
brazil devotees
Andhra Pradesh
  • Loading...

More Telugu News