Bapatla: టాటా ఏస్ వాహనం బోల్తా.. బాపట్లలో నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

Four Ayyappa devotees died in Road Accident in Bapatla
  • అదుపు తప్పి బోల్తా పడిన వాహనం
  • మరో 15 మందికి తీవ్ర గాయాలు
  • తెనాలి ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు 
బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం వేమూరు మండలం జంపని వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. 

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. మృతులను కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేశ్ (55), బోదిన రమేశ్ (42), బుద్దన పవన్ కుమార్ (25) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bapatla
Ayyappa Devotees
Road Accident

More Telugu News