ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించొద్దని ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించొద్దని ఆదేశం

Medical Students In AP Not To Wear Jeans and T Shirts
  • డ్రెస్‌కోడ్‌ను పాటించకపోవడంతో తాజాగా మరోమారు ఆదేశాలు
  • మహిళా విద్యార్థులు తప్పనిసరిగా చీర లేదంటే చుడీదార్‌తో రావాలని ఆదేశం
  • పురుషులు క్లీన్ షేవ్‌తో రావాలని సూచన
  • స్టెతస్కోప్, యాప్రాన్ తప్పనిసరని ఆదేశం
  • సహాయకులు లేరన్న కారణంతో రోగులను చేర్చుకోవడం మానొద్దన్న డీఎంఈ
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా జీన్స్ ధరించకూడదు. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది. అలాగే, తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని ఆ ఆదేశాల్లో  పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలివ్వడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, బోధనాసుపత్రులకు రోగులు వస్తే కనుక వారికి సహాయకులు లేరన్న కారణంతో వారిని చేర్చుకోవడం మానొద్దని సూచించింది.
Advertisement
Medical Students
Andhra Pradesh
Jeans
T-Shirts

More Telugu News