Ayyanna Patrudu: తింగరి సాయిరెడ్డీ... ఫోన్ ఎటు తిప్పినా ఒకటే బొమ్మ వస్తుంది!: అయ్యన్న

Ayyanna counters Vijayasai Reddy remarks on Lokesh

  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన
  • చిన్నారితో సెల్ఫీ
  • వ్యంగ్యం ప్రదర్శించిన విజయసాయి
  • కౌంటర్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఓ చిన్నారితో సెల్ఫీ సందర్భంగా ఫోన్ ను తిరిగేసి పట్టుకోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి... నువ్వే తలకిందులుగా ఉండి సెల్ఫీ తీసుకోవచ్చు కదా? అంటూ లోకేశ్ ను ఎద్దేవా చేశారు. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. "తింగరి సాయిరెడ్డీ... ఫోన్ ఎటు తిప్పినా ఒకటే బొమ్మ వస్తుంది... ఫోన్ తిప్పి పట్టుకున్నంత మాత్రాన బొమ్మ తిరగేసి రాదు" అని బదులిచ్చారు. "నువ్వూ... నీ ఏ2 తెలివితేటలు" అంటూ ఎద్దేవా చేశారు. 

అంతేకాదు, లోకేశ్ ఫొటోతో విజయసాయి చేసిన ట్వీట్ ను కూడా అయ్యన్న ఈ సందర్భంగా పంచుకున్నారు. కాగా, అయ్యన్న మరో ట్వీట్ లో... విజయసాయి ఫోన్ త్వరగా దొరకాలని వెంకన్నస్వామిని కోరుకున్నానని తెలిపారు. 

వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా రెండు కోరికలు కోరుకున్నానని వెల్లడించారు. "ఒకటి... ఈ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని, పిల్లల భవిష్యత్ దెబ్బతినకుండా చూడాలని కోరుకున్నాను. రెండు... ఏ2 విజయసాయిరెడ్డి ఫోన్ కనిపించడంలేదు... ఆ ఫోన్ ఎక్కడుందో దొరికేలా చూడాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆ ఫోన్ లో ఢిల్లీ లిక్కర్ స్కాం వివరాలు, విశాఖ భూ కుంభకోణం వివరాలు ఉన్నాయి" అని వివరించారు.

Ayyanna Patrudu
Vijayasai Reddy
Nara Lokesh
Selfie
TDP
YSRCP
  • Loading...

More Telugu News