Team India: భారత్ తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ ఆల్ రౌండర్

Shakib Al Hasan returns to Bangladesh squad for ODIs against India
  • ఆగస్టు నుంచి వన్డే ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న షకీబ్ అల్ హసన్ 
  • వచ్చే నెల బంగ్లా దేశ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
  • బంగ్లాదేశ్ తో మూడు వన్డేల్లో పోటీ పడనున్న రోహిత్ సేన
భారత్ వన్డే సిరీస్ కోసం స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. భారత్ తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన బంగ్లా జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. ఎడమ చేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం స్థానంలో షకీబ్ జట్టులోకి వచ్చాడు. ఆగస్టులో జింబాబ్వే తో సిరీస్ నుంచి షకీబ్ వన్డే ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. కాగా, భారత జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 16 మందితో కూడిన జట్టును తమీమ్‌ ఇక్బాల్‌ నడిపిస్తాడు. డిసెంబర్‌ 4, 7, 10వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
  
 బంగ్లాదేశ్‌ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ దాస్, అనాముల్ హక్, షకీబ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్, హసన్ మహ్ముద్, ఎబాదట్, నసుమ్‌ అహ్మద్‌, మహ్మూద్‌ ఉల్లా, నజ్ముల్ శాంటో, క్వాజీ నురుల్‌.
Team India
Bangladesh
Shakib Al Hasan
returns
ODI

More Telugu News