Maharashtra: ‘నాకు భార్యవి అవుతావా?’ అంటూ బాలిక ఫొటోతో బాలుడి స్టేటస్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Case Against 14 Year Boy For His Instagram Status

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • తనతో స్నేహం చేయాలంటూ బాలిక వెంట పడిన బాలుడు
  • పట్టించుకోకపోవడంతో ఫొటో తీసి స్టేటస్
  • పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడు పెట్టిన స్టేటస్ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడానికి కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణెలో ఓ స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి.. అదే పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలిక వెంటపడుతూ తనతో స్నేహం చేయాలని వేధించేవాడు. అంతేకాదు, తనతో ఫ్రెండ్‌షిప్ చేయకుంటే ఎత్తుకుపోతానని బెదిరించాడు. 

అతడి బెదిరింపులను బాలిక లెక్కచేయకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. బాలిక ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పెట్టుకుంటూ.. ‘నువ్వు నా భార్యవి అవుతావా?’ అని రాసుకున్నాడు. అది చూసిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Maharashtra
Pune
Instagram
  • Loading...

More Telugu News