Virat Kohli: ధోనీ ఎక్కడ లేడు...?: కోహ్లీ

He is everywhere Virat Kohli epic Instagram story about MS Dhoni sets internet ablaze

  • ఓ వాటర్ బాటిల్ పై ధోనీ ముఖచిత్రం
  • దీన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన విరాట్ కోహ్లీ
  • అన్ని చోట్లా ఉంటాడు.. వాటిర్ బాటిల్ పైనా అంటూ కామెంట్

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ స్నేహం గురించి క్రికెట్ అభిమానులకు బాగానే తెలుసు. తన తర్వాత కెప్టెన్సీ వారసుడిగా కోహ్లీని ధోనీయే ప్రమోట్ చేశాడు. అంతేకాదు, క్లిష్ట సమయాల్లోనూ కోహ్లీకి అండగా నిలిచాడు. కోహ్లీయే అని కాదు, హార్థిక్ పాండ్యా సహా ఎంతో మంది ఆటగాళ్లకు ధోనీ మార్గదర్శకుడిగా వ్యవహరించాడు. అందుకే ఆటగాళ్లు ధోనీ గురించి వీలున్నప్పుడల్లా స్మరిస్తుంటారు.

విరాట్ కోహ్లీ తాజాగా ధోనీ ప్రస్తావన చేశాడు. ఓ వాటర్ బాటిల్ కంపెనీ ధోనీ ఫొటోను తన వాటర్ బాటిల్ పై ముద్రించింది. ఈ ఫొటోను కోహ్లీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ‘‘అతడు అన్ని చోట్లా ఉంటాడు. వాటర్ బాటిల్ పైన కూడా’’ అని క్యాప్షన్ పెట్టాడు. తద్వారా ధోనీ పట్ల తన అభిమానాన్ని కోహ్లీ గుర్తు చేసినట్టయింది. ధోనీ తన కెరీర్ ఆసాంతం మద్దతుగా నిలిచిన వ్యక్తి అని ఓ సందర్భంలో కోహ్లీ చెప్పడం గమనార్హం.

Virat Kohli
Instagram story post
MS Dhoni
water bottle
  • Loading...

More Telugu News