Maruti Suzuki: 34 కిలోమీటర్ల మైలేజీనిచ్చే మారుతి ఆల్టో కే10 సీఎన్ జీ

New Maruti Suzuki Alto K10 CNG already has discounts up to Rs 30000

  • ఎక్స్ షోరూమ్ ధర రూ.5.94 లక్షలు
  • రూ.30,000 వరకు డిస్కౌంట్
  • వీఎక్స్ఐ పేరుతో ఒకటే వేరియంట్ విక్రయం

మారుతి సుజుకీ కొత్త ఆల్టో కే10 సీఎన్ జీ వెర్షన్ ను విడుదల చేసింది. ఇందులో వీఎక్స్ఐ పేరుతో ఒక్కటే వెర్షన్ ను విక్రయిస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.94 లక్షలుగా ఉంది. మారుతి ఇతర మోడళ్లలోనూ సీఎన్ జీ వేరియంట్లను విక్రయిస్తుండడం గమనార్హం.

ఆల్టో కే10 సీఎన్ జీ వీఎక్స్ఐ కారు 1.0 లీటర్ డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ ఇంజన్ తో పనిచేస్తుంది. 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంటుంది. కిలో సీఎన్ జీ ఇంధనంతో 33.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకీ ప్రకటించింది. అంతేకాదు ఈ కారుపై రూ.30,000 వరకు డిస్కౌంట్స్ ను ఇస్తోంది. 

మారుతి సుజుకీ మొత్తం 13 రకాల సీఎన్ జీ కార్లను విక్రయిస్తోంది. ఆల్టో 800, ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, వాగన్ ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్ఎల్ 6, సూపర్ క్యారీ, టూర్ ఎస్ ఇందులో ఉన్నాయి. 

Maruti Suzuki
NEW Alto K10
CNG variant
discounts
  • Loading...

More Telugu News