gym: 56 ఏళ్ల వయసులో చీరకట్టుతో మహిళ వ్యాయామం!

Video Of 56 Year Old Woman Working Out In Saree Leaves Internet Stunned

  • ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానంటున్న మహిళ
  • చెన్నైలోని జిమ్ లో రోజూ వ్యాయామం చేస్తానని వెల్లడి
  • ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియో

వయసు పైబడుతున్నకొద్దీ ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వ్యాయామంతో దూరంచేసుకోవచ్చని తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెబుతోంది. చెప్పడమే కాదు, స్వయంగా వ్యాయామం చేసి చూపిస్తోంది. 56 ఏళ్ల వయసులో చీరతోనే జిమ్ చేస్తూ వ్యాయామం చేయడానికి ఏదీ అడ్డుకాదని చాటిచెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల మహిళ మోకాళ్ల నొప్పులతో చాలా రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. అయినా ఉపయోగం లేకపోవడంతో కొడుకు సలహామేరకు జిమ్ లో చేరింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో కొన్నాళ్లకే మార్పు కనబడిందని చెబుతోంది. ఇప్పుడు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానని వివరించింది.

చెన్నై లోనే తన కొడుకుకు ఓ జిమ్ ఉంది.. కోడలుతో కలిసి రోజూ వెళ్లడం ప్రారంభించారా మహిళ. చీరతోనే వెళ్ళి బరువులు ఎత్తుతూ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాలుగేళ్ల క్రితం.. అంటే తన 52వ ఏట వ్యాయామం మొదలుపెట్టానని, ఇప్పుడు ఆరోగ్యంగా చురుకుగా ఉన్నానని వివరించారు. సదరు మహిళ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ.. ఆమె వయసు 56 ఏళ్లు.. జిమ్ కు చీరలో వస్తారు.. అయితేనేం, వ్యాయామం చేయకుండా ఆవిడను ఏదీ ఆపలేదని హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్బెల్ కామెంట్ చేశాయి.

https://www.instagram.com/reel/Ck3NWmrKEvW/?utm_source=ig_embed&utm_campaign=loading

gym
saree
old lady
workout
chennai
  • Loading...

More Telugu News