Pawan Kalyan: 'జల్సా' ప్రదర్శన ద్వారా రూ.1 కోటి విరాళం సేకరించి పవన్ కల్యాణ్ కు అందజేసిన జనసైనికులు

Janasena workers handed Pawan Kalyan Jalsa re release collections

  • ఇటీవల పవన్ పుట్టినరోజు
  • 'జల్సా' చిత్రం రీ రిలీజ్
  • ఆశించినస్థాయిలో వసూళ్లు
  • అభినందించిన నాగబాబు

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'జల్సా' చిత్రం రీ రిలీజ్ చేయడం తెలిసిందే. 'నా సేన కోసం నా వంతు' అనే కార్యాచరణలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. 

ఈ క్రమంలో, జనసైనికులు సాయిరాజేష్, ఎస్కేఎన్, సతీష్ భొట్ట, ధర్మేంద్ర 'జల్సా' చిత్ర ప్రదర్శన ద్వారా రూ.1 కోటి విరాళం సేకరించారు. ఈ విరాళం తాలూకు చెక్కును నేడు జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు చేతులమీదుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అందించారు. 

కాగా, సాయిరాజేష్, ఎస్కేఎన్ తదితరులను నాగబాబు అభినందించారు. వారి అభిమానం పవన్ తో ఫొటో కోసం ఆగకుండా కోటి రూపాయలు సేకరించే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. పార్టీకి ఉపయోగపడే పని ఏదైనా చేసి పవన్ కల్యాణ్ ను కలవాలి అనే వారి సంకల్పం ప్రశంసనీయం అని నాగబాబు పేర్కొన్నారు. జల్సా చిత్ర ప్రదర్శన కోసం వారికి ఉమా నాగేంద్ర శ్రీధర్, యతీంద్ర, జ్ఞానవర్ష, నవీన్ విశేషంగా తోడ్పాటు అందించారని తెలిపారు.

Pawan Kalyan
Jalsa
Re Release
Janasena
Nagababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News