WhatsApp: రెండు మొబైల్స్ లో ఒకే నంబర్ పై వాట్సాప్?   

How to use one WhatsApp number on two mobile phones

  • త్వరలోనే ఈ సదుపాయాన్ని తీసుకురానున్న వాట్సాప్
  • ఇప్పటికే బీటా టెస్టర్ల స్థాయిలో పరీక్ష
  • మిస్డ్ కాల్స్ గురించి తెలియజేసే కొత్త ఫీచర్

వాట్సాప్ ఆవిష్కరణలకు పెట్టింది పేరు. కొత్త దనంలో వెనుకబడితే, మరో కొత్త మాధ్యమం పుట్టుకొచ్చి యూజర్లను ఎగరేసుకుపోయే రోజులు ఇవి. అందుకని ఉన్న యూజర్లను కాపాడుకోవడమే కాకుండా, కొత్త వారిని సొంతం చేసుకోవడం అన్నది ఆవిష్కరణలతోనే సాధ్యమని వాట్సాప్ ఎప్పుడూ నమ్ముతుంటుంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను అందిస్తుంటుంది. ఒకే నంబర్ పై రెండు మొబైల్స్ లో వాట్సాప్ సేవలు త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. బీటా టెస్టర్లు ఇప్పుడు ఈ సదుపాయాన్ని పరీక్షించే పనిలో ఉన్నారు. 

వాట్సాప్ లో ప్రస్తుతం లింక్డ్ డివైజెస్ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీని ద్వారా కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ఇలా మొబైల్ ఫోన్ కు అదనంగా, నాలుగు ఇతర డివైజెస్ లోనూ ఒకే వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. త్వరలోనే ఒకే నంబర్ పై రెండు మొబైల్స్ లో వాట్సాప్ లాగిన్ కు అవకాశం కల్పించనుంది. అలాగే, ప్రస్తుతం ఒక ఖాతాపై ఎన్ని డివైజెస్ లో వాట్సాప్ లాగిన్ అయి ఉన్నది తెలుసుకునే ఫీచర్ ను సైతం వాట్సాప్ తీసుకువస్తోంది. దీనివల్ల తమ ఖాతాను గుర్తు తెలియని వారు ఎవరైనా యాక్సెస్ చేస్తుంటే తెలుసుకుని చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. 

అలాగే, మిస్డ్ కాల్స్ సేవలను కూడా వాట్సాప్ తీసుకు వస్తోంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్ ను ఏనేబుల్ చేసుకున్న సమయాల్లో కాల్స్ మిస్ అయితే ఆ సమాచారాన్ని అందించనుంది.

WhatsApp
one account
two phones
missed calls
  • Loading...

More Telugu News