vision loss: ఈ నాలుగూ చేస్తే.. కంటి చూపు ఎంతో మెరుగు

Suffering from vision loss Four best tips to maintain eye health

  • కళ్లను చేతులతో తాకొద్దు
  • దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
  • బ్యాక్టీరియల్ కంజెంక్టివైటిస్ రిస్క్ కూడా ఎక్కువే
  • తగినంత నిద్ర చాలా అవసరం

స్మార్ట్ ఫోన్ల వల్ల నేడు కంటికి కూడా పని ఎక్కువైపోయింది. వీటికి తోడు, డెస్క్ టాప్, ల్యాప్ టప్ పై పని కూడా గతంతో పోలిస్తే పెరిగింది. చాలా రంగాల్లో పనులు అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. దీంతో కళ్లకు తగినంత విశ్రాంతి ఉండడం లేదు. కంటి సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యకర ఆహార అలవాట్లు, క్రమం తప్పిన జీవనశైలి, ఫోన్ల అధిక వినియోగం ఇవే కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కంటి చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం, కంట్లో మంట, కంటి వెంట నీరు కారడం తదితర సమస్యలతో బాధపడాల్సి వస్తోంది.

సాధారణంగా వయసు పెరుగుతున్న క్రమంలో కంటి చూపు మసకబారడం సహజం. కానీ, చిన్న వయసులోనే ఈ సమస్య కనిపిస్తే అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయవద్దు. ఉదయం నిద్రలేస్తూనే స్మార్ట్ ఫోన్ పట్టుకుంటున్నారు. రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ తోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి చూపు మసక బారకుండా  ఉండాలంటే కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం
కళ్లు ఆరోగ్యకరంగా ఉండాలంటే, అవసరమైన ముఖ్య పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇందుకోసం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, చేపలు తీసుకోవచ్చు. విటమిన్ ఏ, సీ అధికంగా ఉండే వాటిని (చేపలు) తీసుకోవాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మాక్యులా ఆరోగ్యానికి ఒమెగా 3 అవసరం. 

తగినంత నిద్ర
తగినంత నిద్ర పోయి చూస్తే, కంటి చూపులో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ తేడా మనకే స్పష్టంగా తెలుస్తుంది. రాత్రి వేళ తగినంత నిద్రపోయే వారికి రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. కళ్లల్లో వాపు, కంటి చుట్టూ నల్లటి వలయాలు కూడా రావు. 

సన్ గ్లాసెస్ 
కంటికి అందం కోసం, ఫ్యాషన్ కోసం సన్ గ్లాసెస్ అనుకోవద్దు. కంటి చూపు సమస్యలు లేని వారు సైతం దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు విడుదల చేసే అతినీలలోహిత కాంతి కిరణాల ప్రభావం మనపై కళ్లపై పడకుండా కళ్లద్దాలు కాపాడతాయి. ఎక్కువ అల్ట్రావైరస్ కిరణాలకు లోనైతే కంట్లో క్యాటరాక్ట్ పెరిగిపోతుంది. 

కంటిని తాకొద్దు
కొందరు తరచూ కళ్లను టచ్ చేస్తూ, కళ్లను నలుపుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎన్నో రకాల బ్యాక్టీరియా చేతుల ద్వారా కంటికి చేరుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కంజక్టివైటిస్ సమస్యల రిస్క్ పెరుగుతుంది.

vision loss
Suffering
recovery
good eyes health
  • Loading...

More Telugu News