Devi Sri Prasad: 'వాల్తేర్ వీరయ్య' ఫస్ట్ సాంగ్ ఇప్పుడే చూశాను... మైండ్ బ్లోయింగ్!: దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad says he has seen Waltair Veerayya first song

  • చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య
  • ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చిన దేవిశ్రీ
  • చిరు ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారని వెల్లడి
  • ఫస్ట్ సింగిల్ ఈ వారంలో వస్తుందని వివరణ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేర్ వీరయ్య. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కు ఇటీవలే టైటిల్ ఫిక్స్ చేయగా, సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది.

కాగా, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన అప్ డేట్ అందించారు. వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సాంగ్ చూశానని, మైండ్ బ్లోయింగ్ అని వెల్లడించారు. ఈ పాటలో చిరంజీవి ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారని దేవిశ్రీ వెల్లడించారు. 

ఈ వార్తను లీక్ చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని తెలిపారు. వాల్తేర్ వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ ఈ వారంలో రిలీజ్ అవుతుందని తెలిపారు. అభిమానులూ... పార్టీకి రెడీగా ఉండండి... ఎందుకంటే ఇది బాస్ పార్టీ అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. 

కాగా, ఈ పాట సినిమాలో చిరు ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ హుషారైన పాటలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటించింది. ఈ పాటను ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలో ప్రత్యేక సెట్ వేసి చిత్రీకరించారు.

ఐటెం సాంగ్స్ అంటే దేవిశ్రీ ఎంత కిర్రెక్కించే ట్యూన్లు ఇస్తాడో తెలిసిందే. దాంతో వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సింగిల్ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

Devi Sri Prasad
Waltair Veerayya
First Song
Chiranjeevi
Megastar
Boss Party
Bobby
Tollywood
  • Loading...

More Telugu News