Harish Rao: పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లయినా పూర్తి కాదు: తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు

Telangana minister Harish Rao says Polavaram project wont complete in five years

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు
  • పోలవరం ఇంజినీర్లతో మాట్లాడానని వెల్లడి
  • కాళేశ్వరం కంటే ముందే పోలవరం ప్రారంభించారని వివరణ

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదని అన్నారు. మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేట్టు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. 

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడానని హరీశ్ రావు తెలిపారు. మరో ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తయితే గొప్పేనని ఇంజినీర్లు చెప్పారని వెల్లడించారు. పోలవరంపై అక్కడి ఇంజినీర్లకే స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో కాళేశ్వరంపై విపక్షాలు అనవసరంగా రగడ సృష్టిస్తున్నాయని విమర్శించారు.

Harish Rao
Polavaram Project
Kaleswaram Project
TRS
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News