Kamal Haasan: కమల్ హాసన్ కు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ

Kamal Haasan turns 68 Shankar to Khushbu celebs wish Ulaganayagan a happy birthday

  • 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కమల్ హాసన్
  • కేరళ సీఎం పినరయి విజయన్ శుభాకాంక్షలు
  • లవ్ యూ సర్ అంటూ ఖుష్బూ ట్వీట్

దక్షిణాదికి చెందిన అగ్ర నటుడు కమల్ హాసన్ నేడు 68వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1954 నవంబర్ 7న తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడి అనే పట్టణంలో కమల్ హాసన్ జన్మించారు. 

ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ అందరికంటే ముందుగా కమల్ హాసన్ కు  శుభాకాంక్షలు చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాలో కమల్ ఇండియన్ 2 సినిమా ఫొటోను పోస్ట్ చేశారు. ‘మా నిధి, బహుముఖ ప్రజ్ఞాశాలికి హ్యాపీ బర్త్ డే’ అంటూ శంకర్ పోస్ట్ పెట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ సైతం 'డియర్ కమల్ హాసన్' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘‘నా ప్రియమైన స్నేహితుడు చక్కని ఆరోగ్యం, సంతోషం, విజయం నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ టన్నుల కొద్దీ శుభాకాంక్షలు పంపుతున్నాను. లవ్ యూ సర్’’ అంటూ ఖుష్బూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. వీరిద్దరూ కలసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇక తెలుగు నటి మంచు లక్ష్మి ప్రసన్న కూడా కమల్ హాసన్ కు శుభాకాంక్షలు తెలియజేసింది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, గాయత్రి తదితర సెలబ్రిటీలు ఎందరో కమల్ ను విష్ చేశారు. 

Kamal Haasan
turns 68
birthday
wishes
Shankar
Khushbu
kerala cm
sarath kumar
prakash raj
  • Loading...

More Telugu News