Gargeyi: వినాయక్ చేతుల మీదుగా 'హలో మీరా' ట్రైలర్ రిలీజ్!

Helllo Meera trailer released

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'హలో మీరా'
  • హీరోయిన్ కి ఎదురైన ఒక సమస్య చుట్టూ అల్లుకున్న కథ 
  • సంగీత దర్శకత్వం వహించిన చిన్నా 
  • దర్శకుడిగా శ్రీనివాస్ కాకరాల

సాధారణంగా స్టార్ డమ్ వచ్చిన తరువాత హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. కానీ ఒకటి రెండు సినిమాలు చేసిన ఒక హీరోయిన్ తో నాయిక ప్రధానమైన సినిమా చేయడం సాహసంతో కూడుకున్న పనే. అలా జనానికి పెద్దగా తెలియని ఒక హీరోయిన్ తో రూపొందించిన సినిమానే 'హలో మీరా'. గార్గేయి ఎల్లాప్రగడ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. టైటిల్ కి తగినట్టుగా మీరా పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. కల్యాణ్ అనే యువకుడితో మీరా పెళ్లి కుదురుతుంది. అంతకుముందు ఆమె సుధీర్ అనే యువకుడితో రిలేషన్ లో ఉంటుంది. మీరా పెళ్లి రెండు రోజుల్లో ఉందనగా అతను సూసైడ్ చేసుకుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించడమే ట్రైలర్ ప్రధానమైన ఉద్దేశం. 

ఒక వైపున పెళ్లి .. మరో వైపున అంతకుముందు ప్రేమించిన వ్యక్తి ఆత్మహత్య.  ఒక వైపున పెళ్లి పనులు .. మరో వైపు నుంచి పోలీసుల నుంచి కాల్స్ .. టెన్షన్ బిల్డప్ చేయడం పైనే పూర్తి దృష్టి పెట్టారు. లక్ష్మణ్ రావు .. వరప్రసాద్ .. పద్మ నిర్మించిన ఈ సినిమాకి శ్రీనివాస్ కాకరాల దర్శకత్వం వహించాడు. చిన్నా సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Gargeyi
VV Vinayak
Srinivas Kakarala
Hello Meera Movie
  • Loading...

More Telugu News