Balakrishna: అడివి శేష్, శర్వానంద్ లతో బాలకృష్ణ అన్ స్టాపబుల్-2 కొత్త ఎపిసోడ్

Balakrishna new episode in Unstoppable 2

  • ఆహా ఓటీటీలో ప్రసారం
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • యువనటులతో లేటెస్ట్ ఎపిసోడ్

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ టాక్ షోను బాలకృష్ణ తనదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ షో రెండో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్ లో బాలయ్య యువ నటులు అడివి శేష్, శర్వానంద్ లను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్ నేడు ప్రసారమైంది. 

శర్వానంద్ స్పందిస్తూ, సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో సినిమా కెరీర్ ను ఎంచుకున్నానని వెల్లడించారు. తండ్రి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. తొలి చిత్రం ఆడకపోవడంతో, ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న వేషాలు వేశానని వివరించారు. అయితే, ఎప్పటికైనా ఉన్నతస్థానానికి ఎదుగుతానన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదని శర్వానంద్ స్పష్టం చేశారు. 

అటు, అడివి శేష్ స్పందిస్తూ, కెరీర్ ప్రారంభంలో తాను చాలా చోట్ల తిరస్కారాలు ఎదుర్కొన్నానని, ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో శర్వానంద్ ను స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపారు. తనకు రచనలు చేయడంపై ఆసక్తి ఎక్కువని, అందుకే కథలు రాసుకునేవాడ్నని వివరించారు. 

తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడు శంకర్ చిత్రం 'బాయ్స్' ఆడిషన్స్ చాన్స్ వచ్చిందని, కానీ వెళ్లలేదని అడివి శేష్ వెల్లడించారు. ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నారు. ఇక, ఇండస్ట్రీలో తన కంటే పెద్దవాళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదని, వారు చేసుకుంటే తాను కూడా చేసుకుంటానని శేష్ పేర్కొన్నారు.

Balakrishna
Unstoppable-2
Adivi Sesh
Sharwanand
Aha
Tollywood
  • Loading...

More Telugu News