Telangana: రాహుల్ గాంధీ ప్రసంగం ముగియగానే.. వేదికపైనే స్టెప్పులేసిన వీహెచ్, దామోదర రాజనర్సింహ

congress senior leaders v hanmantha rao and damodara rajanarsimha dances on rahul gandhi meeting stage

  • తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర
  • గురువారం ఆందోల్ లో సభ నిర్వహించిన కాంగ్రెస్ నేత
  • రాహుల్ ప్రసంగానికి జనం నుంచి ఊహించని స్పందన
  • జనం స్పందన చూసి మైమరచి స్టెప్పులేసిన వీహెచ్, దామోదర రాజనర్సింహ

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పాదయాత్రకు జనం నుంచి ఊహించిన దాని కంటే అధికంగా స్పందన లభిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని ఆందోల్ లో భారీ బహిరంగ సభ జరిగింది.

ఈ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో రాహుల్ ప్రసంగం ముగిసినంతనే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి చిందులేయడం మొదలెట్టారు. దామోదర స్టెప్పులను చూసిన సీనియర్ నేత వి.హన్మంతరావు తన వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీదే మైమరచి స్టెప్పులేస్తున్న వైనం చూసి పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు.

Telangana
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
Sangareddy District
Andole
V Hanumantha Rao
Demodara Raja Narsimha
  • Loading...

More Telugu News