Ram Charan: ఆఫ్రికాలో చరణ్ దంపతుల విహారం.. అభిమానుల కోసం వీడియో విడుదల

Ram Charan and Upasana lie in the sun look for lions during African vacation

  • ఇటీవలే టాంజానియాలో పర్యటించిన రామ్ చరణ్, ఉపాసన
  • తాజాగా ఆఫ్రికాకు సంబంధించినదే మరో వీడియో విడుదల
  • చాలా రోజులుగా పర్యటిస్తున్న జంట

నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్నారు. చాలా రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు. టాంజానియాలోని ఓ సఫారీలో సింహాలను దగ్గరుండి రామ్ చరణ్ ఫొటోలు తీస్తున్న వీడియోను ఆయనే స్వయంగా కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడం తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ఆమ్లెట్ కూడా వేశాడు. 

తమ పర్యటనకు సంబంధించి తాజా దృశ్యాలతో కూడిన షార్ట్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ఉపాసన పోస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ సింహాలు కనిపిస్తున్నాయి. అలాగే, రామ్ చరణ్, ఉపాసన నేలపై సేద తీరడం, ఓ చెట్టు దగ్గరకు చేరి ఫొటోలు తీసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. గత నెల 20న జపాన్ వెళ్లిన ఈ జంట అటు నుంచి అటే ఆఫ్రికాకు వెళ్లి.. అక్కడి అందాలను దర్శించుకుంటోంది. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)

Ram Charan
Upasana
africa vacation
vedio
instagram
  • Loading...

More Telugu News