Sachin Tendulkar: తనయుడితో కలిసి సచిన్ లాంగ్ డ్రైవ్... రోడ్డు పక్కన చాయ్ దుకాణం వద్ద సందడి చేసిన బ్యాటింగ్ మ్యాస్ట్రో

Sachin stops vehicle for roadside tea

  • బెళగాం-గోవా రహదారిపై సచిన్ ప్రయాణం
  • ఓ టీ షాపు వద్ద కారు నిలిపిన వైనం
  • చాయ్ లో రస్కు ముంచుకుని తింటూ ఎంజాయ్ చేసిన మాస్టర్

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ జాతీయ రహదారి పక్కన ఉన్న టీ దుకాణం వద్ద సందడి చేశారు. సచిన్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ తో కలిసి బెళగాం-గోవా ఎక్స్ ప్రెస్ హైవేపై లాంగ్ డ్రైవ్ కు బయల్దేరారు. మధ్యలో ఓ చోట చాయ్ దుకాణం వద్ద వాహనం నిలిపిన సచిన్... ఎంచక్కా రోడ్ సైడ్ చాయ్ ని ఆస్వాదించారు. చాయ్ లో రస్కు ముంచుకుని తింటూ తన ఫీలింగ్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ మాత్రం వాహనంలోనే ఉండిపోయాడు. 

దీనికి సంబంధించిన వీడియోను సచిన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. రోడ్ ట్రిప్ లో చాయ్ బ్రేక్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను పోస్టు చేసిన కాసేపటికే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లతో అభిమానులు హోరెత్తించారు. 

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ రంజీ సీజన్ లో ముంబయి జట్టును వీడి గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో రంజీ ట్రోఫీ గ్రూప్ దశలో అర్జున్ కు ముంబయి జట్టులో స్థానం దక్కింది. అయితే ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాలేదు. నాకౌట్ దశకు వచ్చేసరికి అర్జున్ ను జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో, మాస్టర్ తనయుడు గోవాకు తరలి వెళ్లాడు.

Sachin Tendulkar
Arjun Tendulker
Tea
Roadside
Belgaum-Goa Highway
Mumbai
  • Loading...

More Telugu News