iPhone users: అతి త్వరలోనే ఐఫోన్ యూజర్లకు 5జీ సేవలు

Some iPhone users in India may get 5G support by next week

  • నవంబర్ 7 నుంచి అందుబాటులోకి
  • ఐవోఎస్ 16 బీటా సాఫ్ట్ వేర్ లాంచ్
  • ఐఫోన్ 14,13, 12, ఎస్ఈ కస్టమర్లకు 5జీ సేవలు

యాపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అంటూ 5జీ సేవల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని రోజుల్లోనే భారత్ లోని ఐఫోన్లకు 5జీ సేవలను యాపిల్ అన్ లాక్ చేయనుంది. 

యాపిల్ ఫోన్లకు 5జీ కనెక్టివిటీ సపోర్ట్ ఫీచర్ ఉన్నప్పటికీ, అది లాక్ చేసి ఉంటోంది. దీన్ని అన్ లాక్ చేయడం ఆలస్యం.. యూజర్లు 5జీ నెట్ వర్క్ సేవలు పొందడానికి వీలు కలుగుతుంది. ఇందులో భాగంగా ఐవోఎస్ 16 బీటా సాఫ్ట్ వేర్ ను యాపిల్ ఈ నెల 7న అందుబాటులోకి తీసుకురానుంది.

ఎయిర్ టెల్, జియో నెట్ వర్క్ పరిధిలో ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ (థర్డ్ జనరేషన్) కలిగి ఉన్న కస్టమర్లు యాపిల్ బీటా సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ ద్వారా 5జీ సేవలను పొందొచ్చు. యూజర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా బీటా టెస్టింగ్ అనంతరం లోపాలను సరిదిద్ది పూర్తి స్థాయి సాఫ్ట్ వేర్ ప్యాక్ ను అప్ డేట్ గా ఐఫోన్ యూజర్లకు యాపిల్ ఇవ్వనుంది.

iPhone users
apple
ios 16 beta
starts
5g services
  • Loading...

More Telugu News