Ayyanna Patrudu: టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్ట్

TDP Leader Chintakayala Ayyanna Patrudi Arrested

  • ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలు
  • తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • నోటీసులు ఇచ్చి టీడీపీ నేతను అరెస్ట్ చేసిన వైనం
  • అయ్యన్న కుమారుడు రాజేశ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అంతకుముందు నర్సీపట్నంలోని ఆయన ఇంటిని సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

Ayyanna Patrudu
TDP
Chintakayala Rajesh
Narsipatnam
  • Loading...

More Telugu News