Divya Pillai: తెలుగు తెరకి మరో ఇద్దరు కొత్త భామలు!

Thaggedele movie heroines
  • ఈ నెల 4న రిలీజ్ అవుతున్న 'తగ్గేదే లే'
  • హీరోయిన్లుగా ముంబై భామ ... మలయాళ బ్యూటీ
  • రొమాంటిక్ గా కనిపిస్తానని చెప్పిన అనన్య రాజ్ 
  • అందంతో ఆకట్టుకున్న దివ్య పిళ్లై 
టాలీవుడ్ లో అడుగుపెడుతున్న కొత్త భామల జోరు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉండేది. లేదంటే తమిళంలో కొంతవరకూ రిలీజ్ అయ్యేవి. ఆ సమయంలో ముంబై నుంచి ఇక్కడికి వచ్చే ముద్దుగుమ్మల సంఖ్యనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఐడియా స్థాయికి ఎదిగింది. తెలుగు సినిమాలలో కనిపిస్తే హిందీకి దగ్గర దారి దొరికేసినట్టే అన్నట్టుగా అయిపోయింది. 
 
ఈ నేపథ్యంలో సౌత్ లో తమ జోరు కొనసాగించడానికి ముంబై భామలు కూడా పోటీ పడుతున్నారు. అక్కడ స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్నవారు కూడా టాలీవుడ్ నుంచి వెళుతున్న అవకాశాలను వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రానున్న 'తగ్గేదే లే' సినిమా ద్వారా మరో ఇద్దరు బ్యూటీలు తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. ఒకరు అనన్య రాజ్ అయితే, మరొకరు దివ్య పిళ్లై. 

అనన్య రాజ్ ముంబైకి చెందిన ముద్దుగుమ్మనే. 2016లోనే తన కెరియర్ ను మొదలుపెట్టేసి, వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. 'తగ్గేదే లే' సినిమాలో ఆమె 'లిజీ' అనే పాత్రలో హాట్ హాట్ గా కనిపించనున్నట్టుగా ఆమెనే చెప్పింది. అంతే హాటుగా ఆమె ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి రావడం విశేషం. ఇక దివ్య పిళ్లై మలయాళీ .. 2015లోనే ఫహాద్ ఫాజిల్ సినిమా ద్వారా ఆమె వెండితెరకి పరిచయమైంది. 'తగ్గేదే లే' ప్రీ రిలీజ్ ఈవెంటులో చాలా గ్లామరస్ గా మెరిసింది. ఈ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఈ ఇద్దరి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.
Divya Pillai
Ananya Raj
Naveen Chandra

More Telugu News