KTR: రేపిస్టులకు దండలేసి ఊరేగించిన చరిత్ర బీజేపీది.. షా చెప్పులు మోసిన చేతులతో దేవుడ్ని తాకుతారా?: కేటీఆర్

There is no value for pray who is belongs to a rapist party says KTR

  • యాదగిరిగుట్టలో సంప్రోక్షణ చేయాలన్న కేటీఆర్
  • ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే కోర్టులు, చట్టాలు ఎందుకని ప్రశ్న
  • సందర్భాన్ని బట్టి కేసీఆర్ స్పందిస్తారన్న కేటీఆర్

రేపిస్టులకు దండలేసి ఊరేగించిన ఘన చరిత్ర బీజేపీదని, అలాంటి వారు చేసే ప్రమాణాలకు విలువ ఏమి ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగ ఎవరో, దొర ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్న ఆయన ఈ విషయంలో ఇప్పుడు ఏం మాట్లాడినా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నానని అంటారని, అందుకే ఈ విషయంలో మాట్లాడడం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తాయన్నారు. అందుకనే ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలకు చెప్పానన్నారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడంపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. రేపిస్టులకు దండలేసి ఊరేగించిన బీజేపీకి చెందిన నాయకులు చేసే ప్రమాణాలకు విలువ ఎక్కడ ఉంటుందన్నారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడ్ని తాకడం పాపమని, అందుకనే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాల్సి ఉంటే చేయాలని వేదపండితులను కోరుతున్నట్టు కేటీఆర్ కోరారు.

KTR
KCR
TRS MLAs Horse Riding
Bandi Sanjay
  • Loading...

More Telugu News