Virat Kohli: కోహ్లీపై ప్రశంసలు కురిపించిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ

BCCI President Roger Binny praises Virat Kohli

  • పాకిస్థాన్ పై కోహ్లీ ఇన్నింగ్స్ ఒక కలలా అనిపించింది
  • కోహ్లీ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో మరింత మెరుగ్గా ఆడతారు
  • ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించింది

విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసలు కురిపించారు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఒక స్వప్నం లాంటిదని, ప్రేక్షకులకు ఒక ట్రీట్ వంటిదని అన్నారు. కోహ్లీ ఒక అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడారని కితాబునిచ్చారు. కోహ్లీ ఇన్నింగ్స్ తనకు ఒక డ్రీమ్ లా ఉందని... గ్రౌండ్ లో నలుమూలలకు కోహ్లీ బంతిని తరలించాడని చెప్పారు. 

కోహ్లీ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో మరింత మెరుగైన ఆటను ఆడతారని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ పై సాధించింది ఒక గొప్ప విజయమని అన్నారు. మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుస్తుందేమో అనే భావనకు అందరూ వచ్చిన సమయంలో... ఒక్కసారిగా భారత్ చేతుల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించిందని అన్నారు. మ్యాచ్ లో ఇండియా గెలిచిన తీరును అందరూ అభినందిస్తున్నారని చెప్పారు. 

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు తాను ఎంతో రుణపడి ఉన్నానని రోజర్ బిన్నీ అన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తాను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు సేవ చేశానని చెప్పారు. 1973లో అండర్ 19 ఆడినప్పటి నుంచి ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేంత వరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తో తనకు అనుబంధం ఉందని అన్నారు.

Virat Kohli
Team India
Roger Binny
BCCI
Pakistan
T20 World Cup
  • Loading...

More Telugu News