Chandrababu: గుత్తి ఆర్టీసీ బస్టాండులో పైకప్పు పెచ్చులూడి మహిళకు గాయాలు... చంద్రబాబు స్పందన

Chandrababu reacts to woman injured at Gooty RTC Bus station

  • గుత్తి ఆర్టీసీ బస్టాండులో ఘటన
  • బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ
  • తలపై పడిన పైకప్పు పెచ్చులు
  • మహిళ తీవ్రంగా గాయపడడం విచారకరమన్న చంద్రబాబు
  • ప్రయాణికులకు కల్పించే భద్రత ఇదేనా అంటూ విమర్శలు

గుత్తి ఆర్టీసీ బస్టాండులో పైకప్పు పెచ్చులూడి ఓ మహిళ గాయపడడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ తలపై పైకప్పు పెచ్చులు పడి ఆమెకు తీవ్రగాయాలు కావడం విచారకరం అని పేర్కొనారు. కొత్త నిర్మాణాలు సరే, ఉన్నవాటి నిర్వహణ కూడా చేతకాదా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆర్టీసీ ప్రయాణికులకు ఇదేనా మీరు కల్పించే భద్రత? అని ప్రశ్నించారు. 

ఆర్టీసీ బస్సు ఎక్కితే చక్రాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదని, బస్సులో ఉన్నాగానీ వానపడితే తడవకుండా గొడుగు పట్టుకుని కూర్చోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రయాణ టికెట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకోకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu
Woman
Injury
RTC Bus Station
Gooty
  • Loading...

More Telugu News