T20 World Cup: కోహ్లీ అద్భుత ఆట చూసి భార్య అనుష్క భావోద్వేగ పోస్ట్

Anushka Sharma Showers Love on Virat Kohli Lauds His Epic Performance vs Pakistan

  • తన జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ చూశానన్న అనుష్క
  • మ్యాచ్ చూస్తూ గదిలో ఎగిరి గంతేశానని వెల్లడి
  • కోహ్లీని చూసి గర్వపడుతున్నానని వ్యాఖ్య

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో  ఆదివారం మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో అత్యద్భుత ఆటతో భారత్ ను గెలిపించిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆశలే లేని పరిస్థితి నుంచి అసమాన పోరాటంతో విరాట్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తన భర్త చేసిన అద్భుతానికి కోహ్లీ భార్య అనుష్క శర్మ పొంగిపోతోంది. మ్యాచ్ ను టీవీలో చూసిన ఆమె విరాట్ ను పొగుడుతూ ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ పోస్ట్ చేసింది.

 ‘విరాట్.. దీపావళి ముంగిట ఈ రాత్రి ప్రజల జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చావు. నువ్వెంతో  అద్భుతమైన వ్యక్తివి. నీ పట్టుదల, సంకల్పం, నమ్మకం ప్రతి గుండెను కదిలించాయి.  నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ని ఇప్పుడే చూశానని గర్వంగా చెబుతున్నా. మ్యాచ్ చూస్తున్నప్పుడు నేను గదిలో గట్టిగా అరుస్తూ ఎగిరి గంతేశా. నేను అలా ఎందుకు చేస్తున్నానో మన చిన్నారి పాపకు అర్థం కాలేదు. కానీ, ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత బలంగా తిరిగొచ్చి తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఏదో రోజు ఆమె అర్థం చేసుకుంటుంది. నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నా. నున్వే నా బలం. నా జీవితం. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని అనుష్క శర్మ పోస్ట్ చేసింది.

T20 World Cup
Virat Kohli
Anushka Sharma
Instagram
Pakistan
Team India
  • Loading...

More Telugu News