Vizag: విశాఖను మీరు రాజ‌ధాని చేయ‌డం ఏంట్రా బాబు?: నాగబాబు

janasena leader nagababu tweet on vizag goes viral on social media
  • విశాఖ‌పై నాగ‌బాబు వైర‌ల్ ట్వీట్‌
  • రాజ‌ధాని అమ్మ మొగుడు లాంటి సిటీ అని విశాఖ‌కు కితాబు
  • వీలైతే ఇండియాకు రెండో రాజ‌ధాని చేయాల‌ని గ‌ర్జించండి అని పిలుపు
  • వైసీపీని టార్గెట్ చేస్తూ నాగ‌బాటు ట్వీట్
అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా శ‌నివారం విశాఖ‌లో అధికార వైసీపీ విశాఖ గ‌ర్జ‌న పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి వెళుతున్న వైసీపీ కీల‌క నేత‌ల‌పై జ‌న‌సేన శ్రేణులు దాడికి పాల్ప‌డ‌టం, ఫ‌లితంగా న‌గ‌రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు నాగ‌బాబు చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

''విశాఖ‌ను మీరు రాజ‌ధాని చేయ‌డం ఏంట్రా బాబు. విశాఖ ఆల్రెడీ రాజ‌ధాని అమ్మ మొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకు రెండో రాజ‌ధాని చేయ‌మ‌ని గ‌ర్జించండి'' అని త‌న ట్వీట్‌లో నాగ‌బాబు పేర్కొన్నారు. అంతేకాకుండా 'వైసీపీ ఇంజ్యూరియ‌స్ టూ ఏపీ ఎన్‌వైరాన్‌మెంట్‌', 'సేవ్ వైజాగ్ ఫ్రం ఎన్‌వైరాన్‌మెంట్ డెస్ట్రాయ‌ర్స్' అనే హ్యాష్ ట్యాగుల‌ను కూడా ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.
Vizag
YSRCP
Janasena
Pawan Kalyan
Nagababu

More Telugu News