Ayyanna Patrudu: టాక్ షోకే మీకు తడిసిపోతోందేంటి రాంబాబూ?: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu satires on Ambati Rambabu

  • చంద్రబాబుతో బాలయ్య నిర్వహించిన టాక్ షోపై అంబటి విమర్శలు
  • నువ్వు ఎంత గొంతు చించుకున్నా జగన్ జైలుకి వెళ్తారన్న అయ్యన్న
  • తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచారని విమర్శ

టీడీపీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన 'అన్ స్టాపబుల్' టాక్ షో రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు, బాలకృష్ణలపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ను దించేయడంపై షోలో చంద్రబాబు మాట్లాడుతూ, వినకపోతే జుట్టు పట్టుకుని లాగామని అంటే... అది న్యాయమే, ధర్మమే అని బాలకృష్ణ అన్నారని అంబటి చెప్పారు. లోక కల్యాణం కోసమే ఎన్టీఆర్ ను దించేశారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని అడిగారు. ఎన్టీఆర్ బతికే ఉంటే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టాక్ షోకే మీకు తడిచిపోతోంది ఏంటి రాంబాబు అని ఎద్దేవా చేశారు. నువ్వు ఎంత గొంతు చించుకున్నా బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన అబ్బాయ్ జగన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని అన్నారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడిగా జగన్ చరిత్రలో నిలవడం ఖాయమని చెప్పారు.

Ayyanna Patrudu
Chandrababu
Balakrishna
Telugudesam
Ambati Rambabu
Jagan
YSRCP
  • Loading...

More Telugu News