Mahesh Babu: మహేష్​ బాబు కొత్త లుక్​.. ఫొటో షేర్​ చేసిన నమ్రతా శిరోద్కర్​

 Mahesh babu new look pic shared by namrata shirodkar

  • మహేశ్ తో తాను దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్
  • కొత్త లుక్ బాగుందంటూ ఆ ఫొటోను షేర్ చేసిన నమ్రత
  • మహేశ్ బాబు ఎప్పుడూ ఇలా అలరిస్తూనే ఉంటారంటూ అభిమానుల కామెంట్లు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ ఇద్దరూ లవింగ్ కపుల్ గా పేరుపొందారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత.. అప్పుడప్పుడూ తన భర్త ఫొటోలను, ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు కొత్త లుక్ తో కూడిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

హెయిర్ స్టైలిస్ట్ తో కలిసి..
  • సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ వద్ద మహేశ్ బాబు హెయిర్ స్టయిలింగ్ చేయించుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా మహేశ్ బాబు తన వద్దకు వచ్చినప్పటి ఫొటోను ఆలిమ్ హకీమ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు.
  • ‘‘సైలెంట్ గా ఉండండి.. ఇక్కడ మన హాట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నారు..” అని క్యాప్షన్ పెట్టారు. ఆ ఫొటోలో మహేశ్ హెయిర్ స్టైల్ కొత్తగా ఉందంటూ నమ్రత తిరిగి షేర్ చేశారు.
  • ఈ ఫొటోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు లక్షా 26 వేల మందికిపైగా లైక్ చేశారు. తమ హీరో కొత్త లుక్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
  • ‘మహేశ్ బాబు ఎప్పుడూ ఇలా అలరిస్తూనే ఉంటారు’ అని కొందరు.. ‘భలే అందంగా ఉన్నాడు’ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
  • ‘మహేశ్ బాబు అందరికీ మోడల్. వయసు అసలు కనిపించదు’ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 
 

Mahesh Babu
Movie news
Namrata
Instagram
Viral Pics
offbeat
  • Loading...

More Telugu News