Contact Lense: మహిళ కంటి నుంచి 23 కాంటాక్టు లెన్సులను తొలగించిన డాక్టర్... వీడియో ఇదిగో!

Doctor removes 23 contact lenses from woman eye

  • కాలిఫోర్నియాలో ఘటన
  • రాత్రివేళల్లో కాంటాక్టు లెన్సులు తొలగించకుండానే నిద్ర
  • మరుసటి రోజు ఉదయం కొత్త లెన్సుల వాడకం
  • వరుసగా 23 రోజులు ఇదే తంతు
  • కంటిలో అసౌకర్యంతో ఆసుపత్రికి పరిగెత్తిన మహిళ

కళ్లద్దాల స్థానంలో కాంటాక్టు లెన్సులు ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. మెరుగైన కంటిచూపు కోసం బయటికి కనిపించే కళ్లద్దాల కంటే, బయటికి కనిపించని కాంటాక్టు లెన్సుల వైపు అత్యధికులు మొగ్గుచూపుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే... అమెరికాలో ఓ మహిళ కంట్లోంచి ఏకంగా 23 కాంటాక్టు లెన్సులు తొలగించిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది.

కాలిఫోర్నియాలో కాథరీనా కుర్తీవా అనే కంటి వైద్యురాలు ఐ క్లినిక్ నిర్వహిస్తోంది. కంటిలో అసౌకర్యంగా ఉందంటూ తన వద్దకు వచ్చిన మహిళకు ఆ డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి, కళ్లలో కాంటాక్టు లెన్సులు పేరుకుపోయాయని గుర్తించింది. ఆ మహిళ కంటి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 23 కాంటాక్టు లెన్సులను బయటికి తీసింది. దీనికి సంబంధించిన వీడియోను కాలిఫోర్నియా ఐ అసోసియేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంది. 

దీనిపై డాక్టర్ కాథరినీ కుర్తీవా స్పందిస్తూ... రాత్రివేళల్లో కాంటాక్టు లెన్సులు తీయకుండానే నిద్రించి, మరుసటి రోజు ఉదయం కొత్త కాంటాక్టు లెన్సు కళ్లలో పెట్టుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వివరించారు. ఆ మహిళ వరుసగా 23 రోజుల పాటు పాత కాంటాక్టు లెన్సులు తొలగించకుండా, కొత్తవి పెట్టుకుందని డాక్టర్ వెల్లడించారు.

Contact Lense
Eye
Woman
Doctor
California
USA
  • Loading...

More Telugu News