Rajamundry: వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మూసివేత... రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికే అంటున్న బుచ్చయ్యచౌదరి

Rajamundry road cum rail bridge will shutdown today onwards

  • బ్రిడ్జికి మరమ్మతులు చేయాల్సి ఉందన్న కలెక్టర్
  • నేటి నుంచి మూసివేస్తున్నట్టు వెల్లడి
  • ఈ నెల 17న బ్రిడ్జి మీదుగా రైతుల పాదయాత్ర
  • శాడిస్టు ఆలోచనలు అంటూ సీఎంపై బుచ్చయ్యచౌదరి ఆగ్రహం

రాజమండ్రిలోని రోడ్ కమ్ రైలు వంతెనను నేటి నుంచి వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

కాగా, ఈ నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా ట్వీట్ చేశారు. 'కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ మండిపడ్డారు. 

ఇన్నాళ్లు గుర్తుకురాని రైల్వే బ్రిడ్జి మరమ్మతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే గుర్తొచ్చాయా? అంటూ నిలదీశారు. రైతుల పాదయాత్ర ఇటుగా వస్తుంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల పేరుతో మూసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఏంచేసేవాళ్లు? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. శాడిస్టు ఆలోచనలు తప్పిస్తే మరొకటి కాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

Rajamundry
Road Cum Rail Bridge
Amaravati
Farmers
Gorantla Butchaiah Chowdary
TDP
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News