Janhvi Kapoor: నేనేమీ అంత అందగత్తెను కాకపోవచ్చు..: జాన్వీ కపూర్

Janhvi Kapoor says people think she takes her position for granted I may not be most talented most beautiful but

  • కానీ సెట్ లో చాలా కష్టపడతా
  • ఈ మేరకు హామీ ఇవ్వగలనన్న జాన్వీ
  • ఈ స్థానం సునాయాసంగా వచ్చిందనుకోవడం పొరపాటని వ్యాఖ్య

నటి శ్రీదేవి కూతురు, వర్ధమాన నటి జాన్వీ కపూర్ తన గురించి ఇతరుల్లో ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేసింది. తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. అయినా కానీ సెట్స్ లో కష్టపడి పనిచేస్తానని తెలిపింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి, భోనీ కపూర్ కుమార్తె అయిన జాన్వీ కపూర్ 2018లో ధడక్ సినిమా ద్వారా సినీ ప్రవేశం చేయడం తెలిసిందే.

తనకు ఈ స్థానం అదృష్టం కొద్దీ, సునాయాసంగా వచ్చిందని భావించడం పొరపాటు అని జాన్వీ పేర్కొంది. తన దగ్గర గొప్ప అందం, టాలెంట్, నైపుణ్యాలు లేకపోవచ్చేమో.. కానీ, సెట్ లో ఎంతో కష్టపడి పనిచేస్తానని హామీ ఇవ్వగలనని జాన్వీ వ్యాఖ్యానించింది. దీన్నే రక్తంతో రాసివ్వగలనని, తన పనితీరుపై అనుమానమే అక్కర్లేదని పేర్కొంది. తనకు అదే పనిని మళ్లీ, మళ్లీ చేయడం బోర్ అని చెబుతూ.. తనకంటూ సవాళ్లను పెట్టుకోవాలని లేదంటే, సమయం వృధా అవుతుందని అనిపిస్తోందని తెలిపింది.

Janhvi Kapoor
hard work
sets
most talented
most beautiful
  • Loading...

More Telugu News