Tamil Nadu: బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న విద్యార్థులు.. అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఇతర విద్యార్థులు!

Polytechnic Student tied Mangal Sutra to plus 2 girl at Bustand in tamil nadu

  • తమిళనాడులోని చిదంబరంలో ఘటన
  • బస్టాండ్‌లో అమ్మాయి మెడలో తాళికట్టిన పాలిటెక్నిక్ విద్యార్థి
  • వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి అరెస్ట్
  • విచారణ ప్రారంభించిన బాలల సంక్షేమ అధికారులు

బస్టాండ్‌లో జరిగిన పెళ్లికి తోటి విద్యార్థులు సాక్షులుగా నిలిచారు. ఈ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగిందీ ఘటన. ఇక్కడి బస్టాండ్ వద్ద పాఠశాల యూనిఫాంలో ఉన్న ప్లస్ టు చదువుతున్న విద్యార్థిని మెడలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తాళి కట్టాడు. సహచర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

బస్టాండ్‌లో అమ్మాయి కూర్చుని ఉండగా అబ్బాయి తాళి కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలల సంక్షేమ అధికారి రమ్య నేతృత్వంలో ఈ ఘటనపై అధికారుల బృందం విచారణ జరుపుతోంది. కాగా, విద్యార్థుల పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బాలాజీ గణేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Tamil Nadu
School Girl
Marriage
  • Loading...

More Telugu News