Naveen Chandra: 'తగ్గేదే లే' నుంచి ఊపేస్తున్న మాస్ బీట్!

  • నవీన్ చంద్ర హీరోగా రూపొందిన 'తగ్గేదే లే'
  • సంగీత దర్శకుడిగా చరణ్ అర్జున్ 
  • తాజాగా ఐటమ్ సాంగ్ రిలీజ్ 
  • మోహన భోగరాజు ఆలాపన ప్రత్యేక ఆకర్షణ 
  • వచ్చేనెల 4వ తేదీన విడుదల  
Theggede le lyrical song released

నవీన్ చంద్ర - నైనా గంగూలీ ప్రధానమైన పాత్రలను పోషించిన 'తగ్గేదే లే' సినిమా, ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో సాగే ఈ ఐటమ్ సాంగ్ మంచి ఊపుతోను .. ఉత్సాహంతోను మొదలవుతుంది.    

కథ ప్రకారం 'బుజ్జమ్మ ధాబా'లో నైట్ ఎఫెక్ట్ లో ఈ సాంగుకి తెరలేస్తుంది. 'మోతుబరే వచ్చినా .. మొనగాడే వచ్చినా .. ఇక్కడెవరు బుజ్జమ్మ .. తగ్గేదే లే' అంటూ ఈ పాట నడుస్తోంది. ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్, ఈ పాటకి సాహిత్యాన్ని అందించాడు. మోహన భోగరాజుతో కలిసి ఆయన ఈ పాటను ఆలపించాడు. 

మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆవిష్కరించిన ఈ పాట, బీట్ పరంగా .. సాహిత్యం పరంగా వాళ్లకి చాలా తేలికగా కనెక్ట్ అయ్యేలానే ఉంది. భాను కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చప్పచ్చు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక కథాకథనాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి.

More Telugu News