India: భార‌త్‌, సౌతాఫ్రికా రెండో వ‌న్డే.. ఇరు జ‌ట్ల‌లో రెండు మార్పులు

  • రుతురాజ్‌, ర‌వి బిష్ణోయ్ స్థానాల్లో సుంద‌ర్‌, షాబాజ్ 
  • మ్యాచ్‌కు సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వూమ‌, స్పిన్న‌ర్ షంసీ దూరం
  • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
India and south africa  2nd odi starts

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ రాంచీలో ఈ మ‌ధ్యాహ్నం మొద‌లైంది. ఇరు జ‌ట్లూ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగాయి. గ‌త మ్యాచ్‌లో ఆడిన ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌, స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ ల‌పై భార‌త్ వేటు వేసింది. ఈ ఇద్ద‌రి స్థానాల్లో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, మ‌రో స్పిన్న‌ర్ షాబాజ్ అహ్మ‌ద్ ల‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంది. గాయ‌ప‌డ్డ పేస‌ర్ దీప‌క్ చాహ‌ర్ స్థానంలో సుంద‌ర్ ను సెలెక్ట‌ర్లు ఈ సిరీస్ కు ఎంపిక చేశారు. మ‌రోవైపు షాబాజ్ కు ఈ మ్యాచ్‌తో వ‌న్డే అరంగేట్రం అవ‌కాశం ద‌క్కింది. 

ఇక‌, ద‌క్షిణాఫ్రికా రెండో వ‌న్డేలో త‌మ కెప్టెన్ టెంబా బ‌వూమ‌, స్టార్ స్పిన్న‌ర్ త‌బ్రియాజ్ షంసీ లేకుండా ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగింది. ఈ ఇద్ద‌రూ అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. దాంతో, రీజా హెండ్రిక్స్‌, బోర్న్ ఫోర్టున్ జ‌ట్టులోకి వ‌చ్చారు. బ‌వూమ స్థానంలో కేశ‌వ్ మ‌హ‌రాజ్ ద‌క్షిణాఫ్రికా స్టాండిన్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. టాస్ నెగ్గిన అత‌ను బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడో ఓవ‌ర్లోనే ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ (5)ను క్లీన్ బౌల్డ్ చేసిన మ‌హ్మ‌ద్ సిరాజ్ భార‌త్‌కు అద్భుత ఆరంభం ఇచ్చాడు.

More Telugu News