Team India: దీప‌క్ చాహ‌ర్ ప్లేస్‌లో వ‌న్డే జ‌ట్టులోకి వాషింగ్ట‌న్ సుంద‌ర్‌

Washington Sundar replaces Deepak Chahar in ODI squad

  • ద‌క్షిణాఫ్రికాతో మూడో టీ20లో గాయ‌ప‌డ్డ చాహ‌ర్‌
  • చాహ‌ర్‌ను వ‌న్డే జ‌ట్టు నుంచి త‌ప్పించిన బీసీసీఐ
  • సుంద‌ర్‌తో చాహ‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేసిన వైనం

భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో ఆడుతున్న వ‌న్డే సిరీస్‌కు సంబంధించి టీమిండియా జ‌ట్టులో స్వ‌ల్ప మార్పు చోటుచేసుకుంది. ద‌క్షిణాఫ్రికాతో చివ‌రి టీ20 సంద‌ర్భంగా గాయ‌ప‌డ్డ ఆల్ రౌండర్ దీప‌క్ చాహ‌ర్‌ను వ‌న్డే జ‌ట్టు నుంచి బీసీసీఐ తొల‌గించింది. దీంతో అత‌డు నేష‌న‌ల్ క్రికెట్ ఆకాడెమీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకోనున్నాడు. చాహ‌ర్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డంతో ఏర్ప‌డ్డ ఖాళీని మ‌రో బౌల‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో బీసీసీఐ భ‌ర్తీ చేసింది. ఈ మేర‌కు శ‌నివారం అధికారిక ప్ర‌కట‌న చేసింది. 

ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా 3 మ్యాచ్‌ల‌తో కూడిన వ‌న్డే సిరీస్‌ను ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే ఓ మ్యాచ్ పూర్తి కాగా... అందులో భార‌త్‌పై ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు విజ‌యం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మిగిలిన రెండు వ‌న్డేల‌కు వాషింగ్ట‌న్ సుంద‌ర్ జ‌ట్లుకు అందుబాటులో ఉండ‌నున్నాడు.

Team India
BCCI
South Africa
Washington Sundar
Deepak Chahar
  • Loading...

More Telugu News